- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా వల్లే సల్మాన్ సినిమా ఫ్లాప్ అయిందని చచ్చిపోమన్నారు.. నటి కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ డైసీ షా ‘జయహో’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా 2014లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి అమ్మడు తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైసీ షా ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘ఏక్ థా టైగర్' తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ఇదే కావడంతో ప్రేక్షకులు 'జయ హో’ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ సినిమా వాళ్లు ఊహించిన స్థాయిలో లేదు. నా వల్లే అది ఫ్లాప్ అయ్యిందని చాలామంది నన్ను విమర్శించారు. అన్ని రకాలుగా ట్రోల్స్‌ను ఎదుర్కొన్నా. మితిమీరి మాటలన్నారు. 'నువ్వు ఇంకా ఎందుకు బతికే ఉన్నావు. చచ్చిపోవచ్చు కదా..? దీనికి మించి ఇంకేం చేయాలనుకుంటున్నావ్?' అని తీవ్రంగా దూషించారు. నా వరకు మా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎందుకంటే, 'ఏక్ థా టైగర్'తో పోలిస్తే మా సినిమా రూ.60 కోట్ల బడ్జెట్‌తోనే తెరకెక్కించాం. రూ.138 కోట్లు వసూళ్లు రాబట్టింది’’ అంటూ చెప్పుకొచ్చింది.