- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సల్మాన్‌తో రొమాంటిక్ ఎక్స్‌పీరియన్స్.. మురిసిపోతున్న హీరోయిన్
దిశ, సినిమా: సల్మాన్ ఖాన్ - ప్రగ్యా జైస్వాల్ కాంబినేషన్‌లో ఇటీవల 'మైన్ చలా' అనే సరికొత్త పాట విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పాట నిజానికి సల్మాన్ నటించిన 'అంతిమ్: ది ఫైనల్ ట్రుత్'లో భాగమని మీకు తెలుసా? ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, సూపర్‌స్టార్ మధ్య ఓ రొమాంటిక్ ట్రాక్ తెరకెక్కించినా.. కథ సీరియస్‌నెస్ కారణంగా ఈ ట్రాక్ ఎడిటింగ్‌లో తొలగించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా అభిమానులతో పంచుకుంది ప్రగ్వా.. సల్మాన్‌తో కలిసి పనిచేయడం గురించి వివరించింది.
'పాట షూటింగ్ జరిగిన రోజే సల్మాన్‌ని మొదటి సారి కలిశాను. అయితే ఆయనతో ఎలా వ్యవహరించాలో నాకు తెలియదు. సాధారణంగా సల్మాన్ లాంటి సూపర్ స్టార్లను ఫస్ట్ టైమ్ కలిసేటప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తెలియకుండా మనం ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే వారికి కోపం రావచ్చు. అందుకే ఆయనను కలిసిన తొలి రోజే 'మిమ్మల్ని ముట్టుకోవచ్చా'? అని అడిగాను. ఎందుకంటే మేం చేయబోయేది ఓ రొమాంటిక్ సాంగ్. అందుకే ఆయన ఏ మూడ్‌లో ఉన్నారో ముందుగానే తెలుసుకోవాలనుకుని ఈ ప్రశ్న అడిగాను. సినిమా షూటింగ్‌లో ఎక్కువ చేస్తుంది కదా అని అనిపించుకోకుండా ఉండడమే నా అసలు ఉద్దేశం. నేను అలా అడగగానే 'ఏం పర్లేదు. నువ్వు నన్ను ముట్టుకోవచ్చు' అని సర్ చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యాను. ఆ తర్వాత సాంగ్ షూట్ అంతా కంఫర్ట్‌గా సాగింది. పాట కూడా బాగా వచ్చింది' అని తన అనుభవాలను చెప్పుకొచ్చింది. అదే పాటను ఇప్పుడు 'మై ఛలా' రూపంలో విడుదల చేసినట్లు తెలిపింది.
https://www.youtube.com/watch?v=BCTrEpb7b0M