- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందరూ చూస్తుండగానే రిపోర్టర్‌కి కిస్ ఇచ్చిన సల్మాన్ ఖాన్ వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వరుస డిజాస్టర్లను అందుకున్నాడు. సల్మాన్ ఇటీవల నటించిన చిత్రం టైగర్-3. ఈ మూవీ థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం బాగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే సల్మాన్ ఇటీవల ఓ నటుడికి స్టేజ్‌పై ముద్దు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ కార్యక్రమంలో భాగంగా కండల వీరుడు రిపోర్టర్‌కే కిస్ ఇచ్చాడు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గోవాలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ కి సల్మాన్ ఖాన్ తన మేనల్లుడు అలీజా అగ్నిహోత్రితో కలిసి అటెండ్ అయ్యాడు. అలీజా ఇటీవల ఫెర్రీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలీజాతో కలిసి గోవా ఫెస్టివల్ లో తిరుగుతూ సల్మాన్ ఖాన్ బాలీవుడ్ కి సంబంధించిన ఒక లేడీ సీనియర్ రిపోర్టర్ ని “ఎలా ఉన్నారు” అని పలకరిస్తూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆ సీనియర్ రిపోర్టర్ కూడా సల్మాన్ ఖాన్ ని సరదాగా పలకరించింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.