Salman Khan : సల్మాన్‌పై దారుణమైన ట్రోలింగ్.. విగ్గేసుకుని కప్పగంతులేశాడంటూ

by sudharani |   ( Updated:2023-02-14 14:16:04.0  )
Salman Khan : సల్మాన్‌పై దారుణమైన ట్రోలింగ్.. విగ్గేసుకుని కప్పగంతులేశాడంటూ
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. తను నటించిన కొత్త సినిమా 'కిసీకా భాయ్ కిసీకా జాన్' ఈ ఏడాది రంజాన్ కానుకగా రిలీజయ్యేందుకు రెడీ అవుతోంది. పూజా హెగ్డే‌తోపాటు వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే 'నైయో లగ్దా' అనే పాటను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ పాటలో కండల వీరుడు వేసిన స్టెప్పులపై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది.

ముఖ్యంగా మెకాళ్లపై కూర్చొని వేసిన ఆ స్టెప్పుపై ఫన్నీ మీమ్స్ క్రియేట్ అవుతున్నాయి. 'సుతారంగా కిందకు కూర్చుని మళ్లీ పైకి లేస్తూ ఏదో హిట్లర్ టైపులో ట్రై చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. పైగా దానికి తోడు జులపాల జుట్టుతో విగ్గేసుకుని ట్రై చేసిన కొత్త లుక్ కూడా ఏమంత ఆకర్షణీయంగా లేదు. కప్పగంతులేసినట్లు ఉంది' అంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed