Salaar Movie: ఆ థియేటర్ లో సలార్ షో నిలిపివేత.. ఎందుకంటే..?

by Prasanna |   ( Updated:22 Dec 2023 2:54 AM  )
Salaar Movie: ఆ థియేటర్ లో సలార్ షో  నిలిపివేత.. ఎందుకంటే..?
X

దిశ,వెబ్ డెస్క్: ప్రభాస్ అభిమానులకు ఈ రోజు పెద్ద పండుగ అనే చెప్పుకోవాలి. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న సలార్ మూవీ నేడు రిలీజ్ అయింది. ఫ్లాప్స్ నుంచి ఈ సినిమా ప్రభాస్ కు మంచి ఊరట లభిస్తుందని అంటారు నమ్మారు. ఎందుకంటే బాహుబలి తర్వాత సరయిన హిట్ పడలేదు. నేడు ఈ మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ అయింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. అలానే తెలంగాణలో కూడా రాత్రి నుంచి షోలు పడుతున్నాయి. కానీ హైద్రాబాద్ లోని మల్లిఖార్జున థియేటర్ లో సలార్ ప్రీమియర్ షో ను నిర్వాహకులు నిలిపి వేశారు. ఎక్కువ మంది థియేటర్ లోకి రావడంతో షో వేయలేదు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. రద్దీని నియంత్రించేందుకు వచ్చిన పోలీసులతో ప్రేక్షకులు వాగ్వాదానికి దిగారు.

Also Read..

Salaar Movie: సలార్ మూవీ బ్లాక్ బస్టర్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసిన టాలీవుడ్ హీరో

Next Story

Most Viewed