- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సలార్ పార్ట్-2 అద్భుతంగా ఉంటుంది.. ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘సలార్’. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. అయితే భారీ అంచనాల నడుమ డిసెంబర్ 22న ఈ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. కలెక్షన్స్ భారీగా రాబడుతూ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. అయితే ప్రభాస్ ఈ సినిమా కోసం ప్రమోషన్స్ చేయనప్పటికీ భారీ విషయాన్ని అందుకుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డార్లింగ్ సలార్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ సలార్ కథ నాకెంతో నచ్చింది. విన్న వెంటనే అంగీకరించారు. నా కెరీర్‌లో చేసిన భిన్నమైన పాత్రల్లో ఇది ఒకటి. ఎంతో సవాలుతో కూడుకున్నది.
బాహుబలి నా కెరీర్‌కు ఒక బెంచ్‌మార్క్‌ను క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఎంచుకున్న సినిమాలన్నీ కొత్తదనం ఉండేలా చూసుకున్నా. అందులో భాగంగానే సలార్‌కు ఓకే చెప్పాను. అలాగే ప్రేక్షకులు కూడా వైవిధ్యమైన కంటెంట్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారతీయ చిత్రాల గురించే చర్చించు కుంటుంది.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని గుర్తిస్తున్నారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పని చేయడం అద్భుతమైన అనుభూతి. సలార్ పార్ట్-1 చివరిలోనే రెండో భాగం ఉంటుందని స్పష్టం చేశాం. మొదటి పార్ట్‌తో పోలిస్తే రెండోది మరింత అద్భుతంగా ఉంటుంది’2 అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.