- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్ స్టార్ హీరో కోసం తండ్రి చేతిలో దెబ్బలు తిన్న సాయిపల్లవి..
దిశ, వెబ్‌డెస్క్: ఎలాంటి గ్లామర్ షో చేయకున్నా కుర్రాళ్లలో భారీ ఫాలోయింగ్ ఉన్న నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి సుపరిచితమే. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా సాయిపల్లవిలా సినిమాల్లో మేకప్ లేకుండా పింపుల్స్ కనిపించేలా నటించలేదు. ఈ భామకు లేడీ పవర్ స్టార్ అనే బిరుదు కూడా వచ్చింది. అయితే ఇంతటి ఫాలోయింగ్ ఉన్న సాయిపల్లవికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే పడి చచ్చిపోతుందట. అయితే ఈ హీరోయిన్ చదువుకునే రోజుల్లో ఆయన సినిమాలు చూసేందుకు ఓ రోజు ఇంట్లో చెప్పకుండా టాకీస్‌కు వెళ్లిందట. కాగా ఇంటికి వచ్చేసరికి లేట్ నైట్ కావడంతో సాయిపల్లవి నాన్న ఆమెను కొట్టాడట. మాకు చెప్పితే మేం తీసుకెళ్తాం కదా? నీవు ఒక్కదానివే ఎందుకు వెళ్లావ్. ఈ నైట్ నీకు ఏమైనా అయితే ఎలా అని గట్టిగా అరిచాడట. ‘‘నాకు ఇష్టమైన హీరో కోసం నేను తీసుకొన్న రిస్క్ అదొక్కటే. ఇక సినిమాల్లోకి వచ్చాక నేరుగా కలిసే ఛాన్స్ వచ్చింది. ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి’’ అంటూ సాయిపల్లవి తాజా ఇంటర్వ్యూలో చెప్పింది.
Read More: రియాల్టీ తెలిసేలోపు మునిగిపోతారు.. మెగాస్టార్‌కు సెన్సేషనల్ డైరెక్టర్ సూచన