- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామాయణ ఇతిహాసంలో సీతగా సాయి పల్లవి? కన్నులపండుగేనంటున్న ఫ్యాన్స్
దిశ, సినిమా: స్టార్ నటీమణులు అలియా భట్, సాయి పల్లవిలకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణం ఇతిహాసం ఆధారంగా హిందీలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కాగా అల్లు అరవింద్, మధు మంతెన భారీ స్థాయిలో నిర్మించబోతున్న ఈ మూవీలో రాముడిగా రణ్‌బీర్‌కపూర్, సీత పాత్రలో అలియాభట్ నటించనున్నారని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి అలియాభట్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హాలీవుడ్‌తో పాటు వరుస బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న అలియా ఈ చిత్రానికి డేట్స్ ఇవ్వలేకపోతుందని, ఈ నేపథ్యంలో సీత పాత్రలో సాయిపల్లవిని సెలక్ట్ చేసినట్లు టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ విషయంపై సాయిపల్లవితో చర్చలు జరపారని, ఆమెకూడా పాజిటీవ్‌గా స్పందించినట్లు సమాచారం. అయితే నిజంగానే సాయి పల్లవి ఈ పాత్ర చేసేందుకు ఒప్పుకుంటే సీతగా అదరగొట్టేస్తుందని, కన్నులపండుగగా ఉంటుందంటూ ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు.