- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sai Dharam Tej :: ‘Bro’ ప్రమోషన్స్‌లో Pawan kalyan పై ఆసక్తికర వ్యాఖ్యలు..
దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల ‘విరూపాక్ష’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన ‘బ్రో’ సినిమాతో జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పవన్ పాలిటిక్స్‌లో ఫుల్ బిజీగా ఉండటంతో సాయి ధరమ్ తేజ్ వరుసగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు.
అందులో భాగంగా మెగా హీరో తన మామ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మామయ్య పవన్ కల్యాణ్‌తో నటించడం గొప్ప అనుభూతి. బ్రో సినిమాలో కేక్ తినిపించే సన్నివేశం ఒకటి ఉంది. ఆ సీన్ చిత్రీకరణ సమయంలో కొంచెం ఇబ్బంది పడ్డాను. అయితే ఆ సన్నివేశం చాలా బాగా వచ్చింది. కళ్యాణ్ మామయ్య ముందు మందు తాగే సీన్ ఒకటి ఉంది. అప్పుడు కూడా బాగా ఇబ్బంది భావన కలిగింది. ఆ సీన్ పూర్తయ్యాక ఏరా నిజంగానే తాగొచ్చావా? అని మామయ్య సరదాగా అడిగారని తెలిపాడు.
అలాగే ఓ పోస్టర్‌లో పవన్ లుంగీ ఎత్తి కట్టి, నోట్లో బీడీ పెట్టి కూలీ గెటప్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఒక దేవుడి పాత్రలో చేస్తూ అలా చేయడం తప్పు కాదా? అని యాంకర్ అడగ్గా.. సాయి ధరమ్ తేజ్ సమాధానమిస్తూ.. అక్కడ దేవుడు కంటే ఒక క్యారెక్టర్ గానే చూడాలి. మనం ప్రకృతిని ఆరాధిస్తాము. బీడీ కూడా ప్రకృతి నుండి వచ్చిందే కదా.. కాబట్టి దేవుడు పాత్ర చేసిన పవన్ కళ్యాణ్ ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. లాజిక్స్ వదిలేసి మా ఇద్దరి కాంబోలో వచ్చే సన్నివేశాలు చూసి బాగా ఎంజాయ్ చేయండి’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి ::
"BRO Movie" ::అమెరికాలో Pawan Kalyan క్రేజ్.. నెక్ట్స్ లెవెల్‌లో ‘Bro’ ప్రమోషన్స్ (వీడియో)