- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘BRO’ మిక్స్‌డ్ టాక్ రావడమేంటి.. రిపోర్టర్‌పై ఫైర్ అయిన Sai Dharam Tej & డైరెక్టర్
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘బ్రో’. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ మూవీ నిన్న రిలీజై మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే మూవీ టీం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సాయి ధరమ్ తేజ్ & డైరెక్టర్ రిపోర్ట్‌పై ఫైర్ అయ్యాడు.
‘బ్రో’ సినిమా వినోదయ సిత్తంకు రీమేక్‌గా వచ్చింది. తమిళ్‌లో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్.. కానీ తెలుగులో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. రెండిటి డైరెక్టర్ మీరే కదా మిక్స్‌డ్ టాక్‌పై మీరేమంటారు అని రిపోర్టర్ ప్రశ్నించగా.. డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘‘ఎక్కడ వచ్చింది మిక్స్‌డ్ టాక్. నేను లైవ్‌లో ఆడియన్స్‌తో కలిసే సినిమా చూశాను. నాకు స్క్రీన్ కూడా కనిపించలేదు. వారు సినిమాను అంత ఎంజాయ్ చేశారు. అయినా టాక్ గురించి నాకు అవసరం లేదు.. 2 గంటలు వాళ్లతో నేను ఎంజాయ్ చేశాను. నేను హ్యాపీ. మీకు వచ్చిందేమో మిక్స్‌డ్ టాక్.. నాకు రాలేదు’’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు సముద్రఖని. అయితే.. డైరెక్టర్ పక్కనే ఉన్న సాయి ధరమ్ తేజ్ కూడా దీనిపై స్పందించారు. ‘మిక్స్‌డ్ టాక్ ఎక్కడ వచ్చింది. ఈ రోజుల్లో మిక్స్‌డ్ టాక్ లేదు. సినిమా హిట్టా, ఫట్టా అంతే. మిక్స్‌డ్ టాక్ లాంటివి లేవు’ అంటూ ఫైర్ అయ్యారు.
Also Read: ‘BRO’ సినిమాలో ఏపీ సీఎంను టార్గెట్ చేసిన Pawan Kalyan..! వైరల్ అవుతున్న మూవీ క్లిప్స్