బాలయ్య షోపై ఆర్‌జీవీ కామెంట్స్.. అవకాశం ఇస్తారేమోనంటూ..

by Disha News Desk |
బాలయ్య షోపై ఆర్‌జీవీ కామెంట్స్.. అవకాశం ఇస్తారేమోనంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: సంచలనాల దర్శకుడు ఆర్‌జీవీ మళ్లీ హాట్ టాపిక్‌గా మారాడు. ఎప్పటికప్పుడు ప్రస్తుతం విషయాలపై స్పందించే ఆయన ఈసారి తన దృష్టి నందమూరి నటసింహం బాలకృష్ణవైపు మార్చాడు. ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షోపై ఆర్‌జీవీ ట్వీట్ చేశాడు. ఆ షో అంటే తనకు ఎంతో ఇష్టమని, బాలయ్య అవకాశం ఇస్తే షోలో పాల్గొంటానంటూ ఆర్‌జీవీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

'నాకు ఆహాలో వచ్చే 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షో అంటే చాలా ఇష్టం. ఎంతంటే భూమీద ఉండే స్ట్రాటో ఆవరణం అంత ఇష్టం. నాకూ ఆ షోలో పాల్గొనాలని ఆశగా ఉంది. అందుకు బాలయ్య అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆర్‌జీవీ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే వేలల్లో షేర్లు అందుకుంది. మరి బాలయ్య తన షోలో ‌ఆర్‌జీవీకి ఏమైనా అవకాశం కల్పిస్తారేమో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed