పవన్ కళ్యాణ్ వల్ల తీరిన రేణు దేశాయ్ కోరిక.. ఫుల్ హ్యాప్పీ అంటూ పోస్ట్!

by Jakkula Samataha |
పవన్ కళ్యాణ్ వల్ల తీరిన రేణు దేశాయ్ కోరిక.. ఫుల్ హ్యాప్పీ అంటూ పోస్ట్!
X

దిశ, సినిమా : ఈ మధ్య సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ చాలా యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి ఆమె పవన్, అకీరా, ఆద్యలకు సంబంధించి వరస పోస్టులు పెడుతూ వస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి అకీరా తన నాన్నతోనే ఉంటున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వస్తున్నాయి. చంద్రబాబును కలిసిన సమయంలో, ఢిల్లీ వెళ్లి మోడీని కలిసిన సమయంలో పవన్ వెంట అకీరా ఉన్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా మెగా ఫ్యామిలీతో కలిసి అకీరా, ఆద్య వెళ్లారు. అయితే తన నాన్న ప్రమాణ స్వీకారోత్సవంలో అకీరా మోడీకి తన చెల్లి ఆద్యను పరిచయం చేశారు. కాగా, ఈ ఫోటోలను రేణుదేశాయ్ పోస్టు చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

నేను బీజేపీకీ పెద్ద ఫ్యాన్.. నా పిల్లలు తన తండ్రి ద్వారా బీజేపీ ప్రధాని మోడీని కలుసుకోవడం అమ్మగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వాళ్ల నాన్న ద్వారా నా కోరిక తీరింది. అకీరా వాళ్ల నాన్నతో మోడీని కలిసినప్పుడు ఆద్య వాళ్లతో వెళ్లలేక పోయింది. ఆ రోజే పాఠశాల ప్రారంభం కావడంతో వెళ్లడం సాధ్యపడలేదు. కానీ నిన్న వాళ్ల నాన్న ఫంక్షన్‌లో అకీరా ఆద్యను ప్రధాని మోడీకి పరిచయం చేశారు. ఇప్పుడు నేను ఫుల్ హ్యాప్పీ అంటూ ఆమె తెలిపింది. ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి అకీరా, ఆద్య సంప్రదాయ దుస్తుల్లో వెళ్లి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అలాగే అకీరా మోడీకి ఆద్యను పరిచయం చేస్తున్నప్పుడు, పవన్ కూతురు సంప్రదాయంగా, పద్ధతిగా నమస్కరించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా, ఇది పద్ధతి అంటూ ఆమెనునెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story