8 నెలల గర్భంతో ఉన్న వీడియో షేర్ చేస్తూ.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన రేణు దేశాయ్

by Hamsa |
8 నెలల గర్భంతో ఉన్న వీడియో షేర్ చేస్తూ.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన రేణు దేశాయ్
X

దిశ, సినిమా: పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. పలు ఆసక్తికర పోస్టులతో నెట్టింట హంగామా చేస్తుంది. అయితే రేణు దేశాయ్ సోషల్ మీడియా ద్వారా ఏ పోస్ట్ పెట్టిన నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఆమెకు అంత క్రేజ్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. నిత్యం తన ఇద్దరు పిల్లలకు సంబంధించిన విషయాలు పంచుకుంటుంది.

అలాగే తన కొడుకు పవన్ ఫ్యాన్స్ మా అన్న వారసుడు అని అంటే ఇటీవల స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసింది. అయితే కొద్ది కాలం పాటు సినిమాలకు దూరమైన ఆమె.. రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రేణు దేశాయ్ పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, రేణు ఓ వీడియోను షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. తన కొడుకు పుట్టిన రోజు కావడంతో విష్ చేసింది.

ఈ చిత్రంలో అకీరాతో నేను 8 నెలల గర్భవతిని. అతని ఆత్మ నన్ను తన తల్లిగా ఎన్నుకున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. నా చిన్న పాప 20వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. హ్యాపీ బర్త్ డే అకీరా’’ అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ జానీ సినిమాతో ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొద్ది కాలానికి వీరిద్దరూ విడిపోయారు. ఏవో విభేదాలు రావడంతో పవన్, రేణు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ మరో మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు. కానీ రేణు దేశాయ్ మాత్రం తన పిల్లలను చూసుకుంటూ వారి భవిష్యత్తు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే కెరీర్‌పై ఫోకస్ పెట్టి పలు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed