అన్నతో రిలేషన్.. తమ్ముడికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్న స్టార్ హీరోయిన్

by sudharani |   ( Updated:2023-10-05 15:49:40.0  )
అన్నతో రిలేషన్.. తమ్ముడికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్న స్టార్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బేబీ’ సినిమా హిట్‌తో ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసిన ఆనంద్ దేవరకొండ.. ప్రస్తుతం ‘గం..గం.. గణేశా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. యాక్షన్ కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీతో ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హై-లైఫ్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్న ‘గం..గం.. గణేశా’ మూవీ నుంచి బ‌ృందావనివే లిరికల్ సాంగ్‌ను నేషనల్ క్రష్ రష్మిక మందన్న రిలీజ్ చేసింది.

అయితే.. గతంలో ‘బేబీ’ సినిమా నుంచి ప్రేమిస్తున్నా సాంగ్ కూడా రిలీజ్ చేసిన రష్మిక.. ఆ సాంగ్ కంటే ‘బృందావనివే’ పాట బిగ్ హిట్ కావాలని బెస్ట్ విషెస్ చెప్తూ ట్వీట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే.. విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్ కారణంగానే అతడి తమ్ముడైన ఆనంద్ దేవరకొండకు ఇంత సపోర్ట్ చేస్తుందా అంటూ నెట్టింట ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed