ప్రెస్‌మీట్‌‌లో రెజీనా ఫైర్.. రిపోర్టర్ అలా అడిగేసరికి..

by Hamsa |   ( Updated:2022-09-07 09:00:49.0  )
ప్రెస్‌మీట్‌‌లో రెజీనా ఫైర్.. రిపోర్టర్ అలా అడిగేసరికి..
X

దిశ, సినిమా : రెజీనా కసాండ్రా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'శాకిని డాకిని'. సౌత్‌ కొరియన్‌ ఫిల్మ్‌ 'మిడ్‌నైట్‌ రన్నర్స్‌'కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించారు. ఈ నెల 16న విడుదలవుతుండగా.. మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించింది చిత్ర యూనిట్‌. ఇదే క్రమంలో ఒక రిపోర్టర్.. 'మీరు ఈ చిత్రంలో ఓసీడీ ఉన్నట్లు నటించారు కదా? నిజ జీవితంలోనూ మీకు ఓసీడీ ఉందా? అని రెజీనాను అడిగాడు.

ఈ ప్రశ్నకు ఇబ్బందిపడ్డ రెజీనా.. 'మీరు అందరినీ ఇలాంటి ప్రశ్నలే అడుగుతారా? సినిమాలో పాత్ర డిమాండ్‌ మేరకే అలా నటించాను. అంతమాత్రాన నాకు ఓసీడీ ఉన్నట్లు కాదు. అమ్మాయిల్ని గొప్పగా చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అవన్నీ వదిలేసి ఓసీడీ గురించి అడుగుతారేంటి? వ్యక్తిగతంగా నేను శుభ్రతను ఇష్టపడతాను. కానీ నాకు ఓసీడీ లాంటి సైకలాజికల్‌ డిజార్డర్స్‌ లేవు' అని బదులిచ్చింది.

Also Read : రణ్‌బీర్-అలియాకు షాక్ ఇచ్చిన భజరంగ్ దళ్.. చేసేదేమీ లేక

Advertisement

Next Story

Most Viewed