ఆసక్తి రేకెత్తిస్తున్న మాస్ మహారాజ రవితేజ 73వ సినిమా ‘ఈగల్’ టీజర్..

by Hamsa |   ( Updated:2023-10-02 09:16:09.0  )
ఆసక్తి రేకెత్తిస్తున్న మాస్ మహారాజ రవితేజ 73వ సినిమా ‘ఈగల్’ టీజర్..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో మాస్ మహారాజ రవితేజ ఇటీవల ‘ధమాకా’ సినిమాతో హిట్ కొట్టి అదే జోష్‌లో దూసుకుపోతున్నాడు. వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీతో రాబోతున్నాడు. అయితే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఇటీవల రవితేజ కొత్త సినిమాను టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని‌తో చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌, టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘ఈగల్’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ మూవీ రవితేజ కెరియర్‌లో 73వ సినిమాగా 2024 సంక్రాంతికి రాబోతుంది. కాగా ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read: ట్విట్టర్ ట్రెడ్డింగ్‌లో SSMB29.. ఆగస్టు 9న స్టార్ట్..?

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

Advertisement

Next Story