- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రావణాసుర’తో నా కల నెరవేరింది.. సంగీత దర్శకుడు హర్షవర్ధన్
దిశ, సినిమా: రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. అభిషేక్ పిక్చర్స్, ఆర్.టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మించగా.. ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ మీడియాతో ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. ‘అభిషేక్ గారు ఒక రోజు కాల్ చేసి ‘రావణాసుర’కు థీమ్ సాంగ్ కావాలని చెప్పారు. వెంటనే ఒక ట్యూన్ చేసి పంపించా. దీంతో ‘నువ్వే మ్యూజిక్ చేస్తున్నావ్’ అని చెప్పగానే నా మైండ్ బ్లాంక్ అయింది. రవితేజ గారితో పని చేయాలనేది నా డ్రీమ్. ఇందులో నాలుగు పాటలతో పాటు నేపధ్య సంగీతం అందించాను. భీమ్స్ ఒక ఐటెం సాంగ్ చేశాడు. ‘రావణాసుర’కు వర్క్ చేయడం ఛాలెజింగ్‌గా అనిపించింది. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇళయరాజాగారి ‘వెయ్యినొక్క జిల్లాల’ పాట రీమేక్, రీమిక్స్ చేయడం ఒక సవాల్‌తో కూడుకున్నది. సంగీత దర్శకుడిగా ఈ మూవీ నన్ను మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నా’ అన్నాడు.
ఇవి కూడా చదవండి: నా కొడుక్కు నాకు ఎలాంటి సంబంధం లేదు.. రవితేజ సంచలన కామెంట్స్!
Ravanasura: రవితేజ ‘రావణాసుర’ రన్ టైమ్.. ఆ సీన్స్ ఎందుకు కట్ చేశారంటే..