- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashmika Mandanna: రష్మిక కొత్త సినిమా అప్డేట్.. ‘పుష్ప-2’కు పోటీగా థియేటర్స్‌లో విడుదల (పోస్ట్)
దిశ, సినిమా: ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. చరిత్రలో నిలిచిపోయిన ప్రముఖ జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే ఇటీవల వచ్చిన పలు సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టి అందరి దృష్టిని ఆకర్శించాయి. తాజాగా, ఓ హిస్టారికల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఛత్రపతి శివాజీ కుమారుడు సాంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ‘చావా’ తెరకెక్కబోతుంది. ఇందులో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా, వీక్కి కౌశల్ జంటగా నటిస్తున్నారు. అలాగే అక్షయ్ ఖన్నా, దివ్య దత్తా, అశుతోష్ రాణా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ అన్ని మంచి రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి.
ఇక ఇప్పుడు రాఖీ పండుగ కావడంతో మేకర్స్ ఛావా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రష్మిక పట్టు చీర కట్టుకుని నగలు ధరించి అందంగా కనిపించింది. ఇక విక్కీ కౌశల్ మాత్రం యుద్ధ వీరుడు సాంబాజీ పాత్రలో అదరగొట్టాడు. అయితే టీజర్‌తో పాటు మేకర్స్ ఛావా విడుదల తేదీ కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా డిసెంబర్ 6న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. అదే రోజున రష్మిక, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప-2 కూడా విడుదల కాబోతుంది. రెండు భారీ బడ్జెట్ మూవీస్ ఒకే రోజు విడుదల కావడం విశేషం. దీంతో ఓకే రోజు రెండు పాన్ ఇండియా చిత్రాల్లో నటించిన హీరోయిన్‌గా రష్మిక క్రేజ్ సంపాదించుకుంది.
Read More..
Rajinikanth: వెట్టైయాన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా తలైవా పోస్టర్