- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటి రెంట్ కట్టలేక రోడ్డున పడ్డ రష్మికా మందన్న ఫ్యామిలీ.. అంత పెద్ద హీరోయిన్‌కి ఇదేం పరిస్థితి?
దిశ, సినిమా: ‘ఛలో’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. ‘గీతా గోవిందం’ మూవీతో మంచి సక్సెస్‌ను అందుకుంది. తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయింది. ఇక ‘పుష్ప’, ‘యానిమల్’ వంటి సినిమాలతో తన సత్తా చాటుకుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రజెంట్ రష్మిక చేతిలో రెండు, మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. హీరోయిన్ తన కెరీర్ స్టార్ట్ కాకముందు తను పర్శనల్ లైఫ్‌లో అనేక కష్టాలను ఎదుర్కొందట.
ఇప్పుడు నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మికా మందన్న ఒక్కో సినిమాకు కొట్లల్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి రష్మిక ఇంటి అద్దె కట్టలేని పరిస్థితుల్లో ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడ్డ సందర్భా్లు కూడా ఉన్నాయట. అంతే కాకుండా రెండు నెలలకు ఒకసారి ఇల్లు మారేవారట. తను చదువుకునే రోజుల్లో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది రష్మిక.
ఆమె మాట్లాడుతూ.. ‘నా జీవితంలో మరొక కోణం ఉంది. నేను బాల్యంలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న కష్టాలు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. మేము ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇల్లు మారుతూ ఉండేవాళ్ళం. సొంత ఇల్లు లేదు. అద్దె ఇంటికి రెంట్ కట్టలేని పరిస్థితి. అందుకే తరచుగా ఇల్లు మారుతూ ఉండేవాళ్ళం. అద్దె కట్టలేక రోడ్డున పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే నేను డబ్బుకు చాలా విలువ ఇస్తాను. నేను నా చిన్నతనంలో ఎదుర్కొన్న కష్టాల కారణంగా సక్సెస్‌ను అంత ఈజీగా తీసుకోను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండగా.. ఆ పరిస్థితుల్లో నుంచి ఈ రోజు స్టార్ హీరోయిన్ స్టేజ్‌కు వచ్చిన రష్మిక పట్ల నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.