డబ్బుల బ్యాగ్ తో కనిపించిన రష్మిక మందన్నా.. వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజెన్స్

by Prasanna |
డబ్బుల బ్యాగ్ తో కనిపించిన రష్మిక మందన్నా.. వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజెన్స్
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అందరికీ ఫేవరేట్ హీరోయిన్ గా అయిపోయింది. ఇప్పుడు వరుస సినిమాలను ఫుల్ బిజీ అయింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉండగా, రష్మికకు సంబంధించిన ఓ వీడియో హల్చల్ చేస్తుంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం కుబేర. ఈ మూవీలో అక్కినేని నాగార్జున, కోలీవుడ్ హీరో ధనుష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంపై మొదటి నుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే దర్శనమిచ్చిన పోస్టర్లు కూడా ఆసక్తిని రేకెత్తించాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ క్రమంలో రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్ ను కూడా విడుదల చేసింది చిత్రయూనిట్.

అర్ధరాత్రి నిర్మానుష్యంగా ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లిన రష్మికకి ఓ బ్యాగ్‌ దొరుకుతుంది. ఆ బ్యాగ్ నిండా డబ్బులు ఉండడం చూసి తెగ సంతోషపడుతుంది. తర్వాత, ఆ బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ఇప్పటికే, విడుదలైన నాగార్జున, ధనుష్ ల ఫస్ట్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.



Next Story