- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫైర్‌లో ఉన్నానంటూ పబ్లిక్‌గా స్టార్ డైరెక్టర్‌తో అలా చేసిన రష్మిక వీడియో వైరల్!
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు స్టార్ హీరో హీరోల చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా రేంజ్ ఎదిగింది. ఇటీవల యానిమల్ చిత్రంలో ఎప్పుడూ లేని విధంగా బోల్డ్ సీన్స్‌లో నటించి భారీ విజయం అందుకుంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్, టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ తన విజయాలతో బాక్సాఫీసును షేక్ చేస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన విషయాలను పంచుకుంటూ ఇట్టే ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంది.
తాజాగా, రష్మిక ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో ఓ యాడ్ షూట్ చేసి ఆ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. అనిరూధ్‌తో కలిసి కూల్ డ్రింక్ ప్రోడక్ట్ 7up యాడ్‌లో పాల్గొంది. అందులో ఈ ముద్దుగుమ్మ మొబైల్ క్యాంటీన్‌కు వెళ్లి అక్కడ చెఫ్‌గా ఉన్న అనిరూధ్‌ను స్పైసీ ఫుడ్‌ను తయారుచేయమని చెప్తుంది. దీంతో అతను రెడీ చేసి ఇచ్చాక అది తిన్న రష్మిక ఘాటుగా ఉందంటూ ఎక్స్‌ప్రేషన్ పెట్టి పైకి చూస్తే ఓ మై గాడ్ ఐయామ్ ఆన్ ఫైర్ అని అరుస్తుంది. అప్పుడు ఓ వ్యాన్‌తో అనిరూధ్ వచ్చి అందరూ చూస్తుండగా ఆమెకు 7up ఇస్తాడు. అది తాగిన ఆమె నవ్వుతూ.. రిపీట్ అంటుంది. దీంతో వీడియో ముగుస్తుంది. అయితే రష్మిక పోస్ట్ చూసిన వారంతా ఇద్దరి కాంబినేషన్ ఊహించలేదు అద్భుతంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.