ముగిసిన రణబీర్ కపూర్ 'యానిమల్' యూకే షెడ్యూల్

by Shiva |
ముగిసిన రణబీర్ కపూర్ యానిమల్ యూకే షెడ్యూల్
X

దిశ, వెబ్ డెస్క్: అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ 'యానిమల్' అనే సినిమాని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది. తాజాగా, మూవీ యూకే షెడ్యూల్ పూర్తి చేసినట్లు సమాచారం. యూకే షెడ్యూల్ ముగింపు సందర్భంగా రణబీర్ కపూర్, బాబీ డియోల్, తదితరులు సెట్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మూవీ టీం త్వరలో ఇండియాకు తిరిగొచ్చి తదుపరి షెడ్యూల్‌ను త్వరలో ప్రారంభించనుంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఆగస్టు 11, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతిష్టాత్మకమైన టీ-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది.

Advertisement

Next Story

Most Viewed