Agninakshatram : 'అగ్ని నక్షత్రం' గ్లింప్స్ రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి..

by Vinod kumar |   ( Updated:2023-10-10 15:35:06.0  )
Agninakshatram : అగ్ని నక్షత్రం గ్లింప్స్ రిలీజ్ చేసిన రానా దగ్గుబాటి..
X

దిశ, సినిమా: మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం 'అగ్ని నక్షత్రం'. వంశీకృష్ణ మళ్ల దర్శకత్వం వహంచిన సినిమాను లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ కలిసి నిర్మించారు. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశాడు నటుడు దగ్గుబాటి రానా.

ఈ వీడియోకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండగా.. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఇందులో ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్ల తో పాటు పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్న సినిమాకు గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు.

Advertisement

Next Story