- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రానా నాయుడు’ పాత్రపై రానా దగ్గుబాటి
దిశ, సినిమా : రానా నాయుడు పాత్రలో మంచి-చెడు రెండూ ఉన్నాయన్నారు రానా దగ్గుబాటి. బాబాయ్ విక్టరీ వెంకటేష్‌తో తొలిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆయన.. ‘నేను సాధారణంగా గుడ్ లేదా బ్యాడ్ పాత్రలను పోషిస్తాను. కానీ రానా పాత్రలో రెండు కలసి వుంటాయి. రానా డార్క్ లైఫ్ గడుపుతుంటాడు. కానీ తన కుటుంబాన్ని పోషించడానికి కూడా కష్టపడతాడు. పేరు తప్పిస్తే, ఆ పాత్రతో నాకు పెద్దగా సారూప్యత లేదు. రానాకు సంక్లిష్టమైన గతం ఉంది. తను కోపాన్ని చాలా తీవ్రంగా ప్రదర్శిస్తాడు. ఇది నాకు సవాల్‌గా అనిపించింది. ఎందుకంటే నేను సాధారణంగా ప్రశాంతంగా ఉంటాను. అదృష్టవశాత్తు మా బాబాయ్‌తో నాకు అఫ్ స్క్రీన్ కూడా మంచి బాండింగ్ వుంది. వైరం వున్న పాత్రలో మెప్పించడం సవాల్‌తో కూడుకున్నప్పటికీ.. మేము కేవలం రానా, నాగా పాత్రలు.. వాటి మధ్య ఉండే ఆవేశం, భావోద్వేగాలపై దృష్టిపెట్టాం’ అని తెలిపారు. కాగా ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 10 నుంచి అందుబాటులోకి రానుంది.