బాలకృష్ణతో నటించనని మొహమాటం లేకుండా చెప్పిన రమ్యకృష్ణ

by Prasanna |   ( Updated:2023-04-30 10:58:59.0  )
బాలకృష్ణతో  నటించనని  మొహమాటం లేకుండా చెప్పిన రమ్యకృష్ణ
X

దిశ, సినిమా: నందమూరి బాలయ్య ఆరు పదుల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. అలాంటి బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా చాన్స్ వస్తే ఎవరు అయినా ఎగిరిగంతేసి మరీ ఎస్ చెప్తారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం బాలయ్యతో నటించడానికి నో చెప్పింది. ఇంతకీ ఆమె ఎవరు అంటే సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. విషయం ఏంటంటే బాలకృష్ణ, టబు, శ్రీయ హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఈ మూవీలో ముందుగా టబు ప్లేస్‌లో రమ్యకృష్ణని తీసుకుందాం అనుకున్నారట. కానీ ఆమె ఆ క్యారెక్టర్ చేయనని డైరెక్ట్‌గా చెప్పేసిందట. ఎందుకంటే ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా.. తండ్రి పాత్ర సరసన రమ్యకృష్ణని హీరోయిన్‌గా అనుకున్నారు. అప్పటికే రమ్యకృష్ణ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతుండటంతో బాలయ్యకు తల్లిగా నటించడానికి ఒప్పుకోలేదట.

Advertisement

Next Story