- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోల మధ్య టైటిల్ పోరు.. గెలిచేదెవరో..
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మరో పోరు మొదలైంది. యంగ్ హీరోలు రామ్ పోతినేని, హవిష్ మధ్య టైటిల్ పోరు జరుగుతోంది. ఇటీవల రాం తన అప్‌కమింగ్ సినిమాకి 'ది వారియర్' అని నామకరణం చేశారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ టైటిల్ తమదంటు హష్ అప్‌కమింగ్ మూవీ మేకర్స్ టాలీవుడ్ ఫిలిం ఛాంబర్‌ను సంప్రదించారు. అయితే హష్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో దాసరి కిరణ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు కూడా 'ది వారియర్' అని పేరు ఫిక్స్ చేసుకున్నారు.
ఈ పేరును వారు ముందుగానే ఛాంబర్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. కానీ మూవీ షూటింగ్ పోలాండ్ మరికొన్ని విదేశాల్లో జరుగుతున్న కారణంగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. ఇంతలో రామ్, లింగుస్వామి కాంబో మూవీకి కూడా ఇదే పేరు పెట్టి అనౌన్స్ చేసేశారు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య టైటిల్ వార్ జరుగుతుంది. దీంతో ఈ విషయం ఫిలిం ఛాంబర్ వారికి తలనొప్పిగా మారింది. మరి ఈ విషయంలో వారు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి.