ఆ విషయంలో విజయ్ దేవరకొండ కంటే రామ్ పోతినేని చాలా బెటర్..!

by Anjali |   ( Updated:2023-06-06 12:04:33.0  )
ఆ విషయంలో విజయ్ దేవరకొండ కంటే రామ్ పోతినేని చాలా బెటర్..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోస్ అయిన రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వినూత్న సినిమాలతో ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దేవదాసుతో ఫస్ట్‌ సినిమాతోనే రామ్ భారీ హిట్ కొట్టగా.. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్‌ ఇండస్ట్రీని షేక్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు వీరిద్దరి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది. దీనంతటికి కారణం డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా స్టోరీని ముందుగా విజయ్‌ దేవరకొండకు చెప్పారట.

అయితే, అప్పటివరకు వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూరికి చాన్స్‌ ఇచ్చేందుకు విజయ్ ఆలోచించినట్లు సమాచారం. విజయ్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆ స్టోరీని పూరి రామ్ పోతినేని చెప్పినట్లు సమాచారం. రామ్ వెంటనే ఓకే చెప్పగా.. ఆ చిత్రం భారీ విజయం సాధించింది. అనంతరం పూరి విజయ్‌తో లైగర్ వంటి పాన్ ఇండియా సినిమా తీసి భారీ పరాజయం మూటగట్టుకున్నారు. దీంతో ఓటమిలో ఉన్నప్పుడు అవకాశం ఇచ్చినోడు గొప్పోడు అంటూ రామ్ ఫ్యాన్స్‌ విజయ్‌ను విమర్శిస్తుండగా.. రామ్‌ను విజయ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Also Read... ‘గుంటూరు కారం’ స్టోరీ నెరేటర్‌గా తమిళ నటుడు..

Heroine: సింగిల్ నైట్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ను గుర్తు పట్టగలరా?

Advertisement

Next Story