- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ హీరోయిన్.. జర్నీ మొదలైందంటూ పోస్ట్
దిశ, సినిమా: హీరోయిన్ అమీ జాక్సన్, చియాన్ విక్రమ్‌తో ఐ మూవీతో నటించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ఎవడు సినిమాలో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుని ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఈ అమ్మడు ఇటీవల క్రాక్ మూవీలో నటించింది. ఇక అమీ జాక్సన్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొద్ది కాలంగా ఇంగ్లీష్ యాక్టర్, మ్యుజీషియన్ ఎడ్వర్డ్ వెస్ట్‌విక్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటించింది. ఇక అప్పటి నుంచి ప్రియుడితో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోలు నెట్టింట పెడుతూ రచ్చ చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అమీ జాక్సన్ తన ప్రియుడు ఎడ్వర్డ్‌ను పెళ్లి చేసుకుంది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘జర్నీ జస్ట్ స్టార్ట్ అయింది’’ అనే క్యాప్షన్ జత చేసింది. అయితే ఈ అమ్మడుకి ఇది రెండో పెళ్లి. కాగా, అమీ జాక్సన్ 2015లో వ్యాపారవేత్త ఆండ్రియాస్ పనాయోటౌను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఆ బాబు బాధ్యత అమీ జాక్సన్ తీసుకుంది.
(Video Link Credits to iamamyjackson Instagram Channel)