హ్యాట్సాఫ్ రాంచరణ్.. తెలంగాణ ఎలక్షన్ కోసం లక్షల రూపాయలను ఖర్చు చేసిన మెగా హీరో!

by sudharani |
హ్యాట్సాఫ్ రాంచరణ్.. తెలంగాణ ఎలక్షన్ కోసం లక్షల రూపాయలను ఖర్చు చేసిన మెగా హీరో!
X

దిశ, వెబ్‌డెస్క్: మరి కొన్ని గంటల్లో తెలంగాణలో ఎలక్షన్లు జరగనున్న విషయం తెలిసిందే. ఇక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం కావడంతో సామాన్యుడు దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు వస్తు్న్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు లక్షలు ఖర్చు పెట్టి వస్తున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్.. ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతోంది. ఇక తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ చరణ్ హైదరాబాద్ బయలుదేరినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ జెట్ విమానంలో భాగ్యనగరానకి వచ్చేందుకు చరణ్ లక్షల్లో ఖర్చు చేశారట. ప్రత్యేకంగా ఫ్లైట్ బుక్ చేసిన రాంచరణ్ తను, తనతో వర్క్ చేసే మరికొందరిని ఆ ఫ్లైట్‌లో హైదరాబాద్ తీసుకు వస్తున్నారు. రేపు ఉదయం ఓటు హక్కును వినియోగించుకోని మళ్లీ అదే ఫ్లైట్‌లో తిరిగిన మైసూర్ వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారట. ఒక్క ఓటు వేయడానికి లక్షలు రూపాయలు ఖర్చుపెట్టి వస్తున్న రాంచరణ్ కమిట్ మెంట్‌ను చూసి ఆయన ఫ్యాన్స్ ఔరా అంటున్నారు. ఊరికెనే ఎవరూ మెగాస్టార్స్ కారు అంటూ చరణ్‌ను ప్రశంసిస్తున్నారు. ఓటు హక్కు పట్ల మెగా హీరోకు ఉన్న బాధ్యతను పొగుడుతున్నారు.

Advertisement

Next Story