ఇంటర్నేషనల్ రేంజ్‌లో రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం

by sudharani |   ( Updated:2023-07-15 15:36:58.0  )
ఇంటర్నేషనల్ రేంజ్‌లో రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం
X

దిశ, వెబ్‌డెస్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్.. పలు అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ఆ సినిమాలో చెర్రీ నటనకు గ్లోబల్ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తాయి. మూవీ వచ్చి దాదాపుగా ఏడాదిన్నర కావొస్తున్నా రామ్ క్రేజ్ మాత్రం అమాంతం పెరుగుతూనే ఉంది. అంతలా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అభిమానం దక్కించుకున్నారు చెర్రీ. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ స్టార్ ఫిక్స్ కవర్‌పై రామ్ చరణ్ ‘‘ఆర్ఆర్ఆర్’ రాముడి ఫోజ్’ ఫోటోని ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ ఫోటోలతో పాటు ప్రింట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇది చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Advertisement

Next Story