పెళ్లై రెండు నెలల కూడా కాకముందే తాళి తీసేసిన స్టార్ హీరోయిన్?

by Disha Web Desk 8 |
పెళ్లై రెండు నెలల కూడా కాకముందే తాళి తీసేసిన స్టార్ హీరోయిన్?
X

దిశ, సినిమా : వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన నటి రకుల్ ప్రీత్ సింగ్. ఈ ముద్దుగుమ్మ అందం అభినయంతో ఫ్యాన్స్‌ను ఎంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి, టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు కాస్త తగ్గాయనే చెప్పవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరు చాలా రోజులుగా ప్రేమించుకున్న తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అతి కొద్ది మంది సమక్షంలో అంగరంగ వైభవంగా గోవాలోని ప్రతిష్టాత్మకఐటీసీ గ్రాండ్‌లో వీరి పెళ్లి జరిగింది.

ఇక పెళ్లైన తర్వాత చాలా మంది హీరోయిన్స్ మెడలో తాళిని వేసుకోరు. కానీ కొంత మంది నటీమణులు మాత్రం పసుపు తాడుతో దర్శనం ఇస్తారు. కానీ స్టార్ హీరోయిన్ రకుల్ పెళ్లై రెండు నెలలు కాకముందే తాళి తీసేసి, నుదిటిన బొట్టు కూడా లేకుండా దర్శనమిస్తుంది. దీంతో నెటిజన్స్ ఆమెపై తెగ ఫైర్ అవుతున్నారు. కనీసం పెళ్ళై రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే తాళి తీసేశావా.. నీ మెడకు తాళి బొట్టే భారమైందా అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం నెట్టిట ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed