ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవాలి.. నెటిజన్‌కు షాకింగ్ రిప్లై ఇచ్చిన రకుల్

by Jakkula Samataha |
ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవాలి.. నెటిజన్‌కు షాకింగ్ రిప్లై ఇచ్చిన రకుల్
X

దిశ, సినిమా : రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. సినిమా మంచి హిట్ టాక్ అందుకోవడంతో, ఈ బ్యూటీకి కూడా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడంతో , వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని, తన గ్లామర్, నటనతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ చెక్కేసి అక్కడ కూడా పలు సినిమాల్లో నటిస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో పడి ఆయన్ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ఎక్కువగా అవకాశాలు లేకపోవడంతో వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. అయితే లేటెస్ట్ గా ఆమె, తన హాట్ అండ్ క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే వాటిని చూసిన ఓ నెటిజన్ షాకింగ్ కామెంట్ చేశారు. రకుల్ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారంటూ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు షాకైన రకుల్ తెలివిగా సమాధానం ఇచ్చింది. ఇంకా ఎన్ని సార్లు పెళ్లి చేసుకోవాలని సరదాగా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed