Rakhi Celebrations in Mega Family: రామ్ చరణ్-నిహారిక క్యూట్ వీడియో వైరల్

by Anjali |   ( Updated:2024-08-19 14:36:17.0  )
Rakhi Celebrations in Mega Family: రామ్ చరణ్-నిహారిక క్యూట్ వీడియో వైరల్
X

దిశ, సినిమా: మెగా ఫ్యామిలీ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా మెగా కుటుంబంలో నిహారిక నిహారిక గారాబం గురించి తెలిసిందే. అయితే నేడు రాఖీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలంతా రాఖీని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినీ సెలబ్రిటీలు కూడా తమ తమ బ్రదర్స్ కు ప్రస్తుతం, గతంలో రాఖీ కట్టిన ఫొటోలు, వీడియోలు, సోషల్ మీడియాలో పంచుకుని రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ వేదికన వేదికన హీరోయిన్ తమన్నా తన బ్రదర్ తో ఉన్న ఓ క్యూట్ పిక్ ను షేర్ చేసి రాఖీ విషెష్ తెలిపింది.

అలాగే రాశీకన్నా, కీర్తి సురేష్ వంటి హీరోయిన్లు నెట్టింట రాఖీ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ అందమైన వీడియో అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో నిహారిక.. చరణ్ కు రాఖీ కడుతుంది. రాఖీ కడుతూ మధ్యలోనే తనను దీవించమని గ్లోబల్ స్టార్ చేయిని తన తలపై పెట్టుకుంటుంది. దీంతో రామ్ చరణ్ నవ్వుతారు. ‘హ్యాపీ రక్షాబంధన్’ అని చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది.

Read More..

Rashmika Mandanna : మూడోసారి డీప్ ఫేక్ బారిన రష్మిక..


Click Here For Twitter Post..

Advertisement

Next Story