- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సంఘీ చెడ్డపదమని ఆమె ఎప్పుడూ అనలేదు.. కూతురు ఐశ్వర్యను సమర్థించిన సూపర్ స్టార్ రజనీకాంత్..
దిశ, సినిమా : తన తండ్రి రజనీ కాంత్‌ను కొందరు ‘సంఘి’ అని పిలువడంపై ఆయన కూతురు ఐశ్వర్య రజనీ ఇటీవల ఓ ఆడియో లాంచ్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సోషల్ మీడియాలో కొందరు ఆమెను తప్పుపడుతున్నారు. అయితే రీసెంట్‌గా (జనవరి 29న) సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా దీనిపై స్పందించారు. కాకపోతే తన కూతురును ఆయన సమర్థించగా, నెటిజన్లు మాత్రం రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఐశ్యర్య ఏం మాట్లాడింది? రజనీకాంత్ ఎందుకని రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందో చూద్దాం.
ఐశ్వర్య రజనీకాంత్ ఇటీవల ‘లాల్ సలామ్’ సినిమాతో దర్శకురాలిగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ స్పోర్ట్స్ డ్రామాటిక్ మూవీలో రజనీకాంత్ ‘మొయిద్దీన్ భాయ్’ పాత్రలో కనిపించనుండగా, విక్రాంత్, విష్ణు విశాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం జనవరి 26న చెన్నైలోని ఒక ప్రైవేట్ కాలేజీలో జరిగింది.
ఆడియోలాంచ్ కార్యక్రమంలో ఐశ్యర్య రజనీ మాట్లాడుతూ.. ‘నేను జనరల్లీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. కానీ మా టీమ్ మాత్రం తరచుగా అందులో ఏం జరుగుతుందో నాతో చెబుతూనే ఉంటుంది. కొన్ని పోస్టులను చూపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వాటిని చూసినప్పుడు నాకు కోపం వచ్చేది. ఎందుకంటే ఇటీవలి కాలంలో చాలా మంది మా నాన్నను ‘సంఘీ’ అని పిలుస్తున్నారు. దాని అర్థం ఏమిటో నాకు తెలియక ఒకరిని అడిగాను. వారు సంఘీ అంటే ఒక పర్టిక్యులర్ పొలిటికల్ పార్టీకి మద్దతు ఇచ్చే వారని తెలిపారు. కానీ మేము కూడా మనుషులమే. రజనీకాంత్ సంఘీ కాదని నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన అదే అయి ఉంటే ‘లాల్ సలామ్’ లాంటి మూవీలో చేసేవాడు కాదు కదా’’ అని ఆడియన్స్‌ను ప్రశ్నించింది ఐశ్వర్య. దీనిపై కొందరు సోషల్ మీడియాలో విరుచుకుపడటంతో తాజాగా రజనీ కాంత్ స్పందించారు. ‘‘సంఘి చెడ్డ పదం’ అని నా కుమార్తె ఎప్పుడూ అనలేదు. ఆధ్యాత్మికతలో ఉన్న తన తండ్రిని అలా ఎందుకు ముద్ర వేస్తున్నారని మాత్రమే ప్రశ్నించింది’’ అని పేర్కొన్నాడు రజనీ.