Raj Tarun:రాజ్ తరుణ్ కు హైకోర్టులో ఊరట

by Prasad Jukanti |
Raj Tarun:రాజ్ తరుణ్ కు హైకోర్టులో ఊరట
X

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ యాక్టర్ రాజ్ తరుణ్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. కాగా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిదే. రాజ్ తరుణ్ తాను ప్రేమించుకున్నామని కొన్నేళ్లపాటు సహజీవం చేశామని ఆ తర్వాత రహస్య వివాహం చేసుకున్నామని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు మరో మహిళతో సన్నిహితంగా ఉంటూ తనను పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో ఆరోపించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ కు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. దీంతో తనపై నమోదైన కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Next Story

Most Viewed