- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగ్గురు కూతుర్లతో భారమైన జీవితం.. స్టార్ హీరో సాయంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళ (వీడియో)
దిశ, సినిమా: డాన్స్ మాస్టర్, స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి తెలిసిందే. ఈయన గొప్ప మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనాధ పిల్లలకే కాకుండా ఎంతో మంది అభాగ్యులకు పలు సేవా కార్యక్రమాలు, ఛారిటబుల్ ట్రస్ట్‌ల ద్వారా తనకు చేతనైన సాయం చేస్తూనే ఉంటాడు. అయితే.. ఈయన్ని ఆధార్శంగా తీసుకున్న లారెన్స్ డై హార్డ్ కేపీవై బాల కూడా తన వంతు సాయం పేదలకు అందిస్తున్నాడు. బాల ఓ స్టాండ్ అప్ కమెడియాన్‌గా రాణిస్తున్నాడు. తన సంసాదనలో అధిక మొత్తాన్ని నిరు పేద కుటుంబాలకు ఉపయోగించడం విశేషం. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి మరోసారి వాళ్ల గొప్ప మనస్సును చాటుకున్నారు.
తమిళనాడుకు చెందిన మురుగమ్మాళ్ అనే మహిళ చిన్న వయసులోనే తన భర్తను కోల్పోయింది. ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు కావడంతో జీవించడం ఎంతో భారంగా ఉండేది. అంతే కాకుండా ట్రైన్‌లో సమోసాలు అమ్ముకుంటూ కుటుంభాన్ని నెట్టికొస్తుంది. అయితే.. ఆటో నడపడం వచ్చిన దాన్ని కొనుక్కునే అంత స్థోమత తనకు లేదు. దీంతో కొందరినీ సాయం కోసం కోరింది. ఆ నోట ఈ నోట ఈ విషయం బాల వద్దకు చేరింది. దీంతో వెంటనే లారెన్స్ వద్దకు ఆమె సమస్యను చేర్చాడు బాల.
ఈ మేరకు లారెన్స్ ఇచ్చిన రూ. 3 లక్షల డబ్బుతో కొత్త ఆటోను బాల కొన్నాడు. ఆమె ఉన్న చోటుకే లారెన్స్ & బాల వెళ్లి ఆటోను ఇచ్చారు. ఎంతో సర్‌ప్రైసింగ్‌గా ఆ ఆటోను ఆమెను ఇవ్వడంతో పాటు.. తన భర్తతో ఉన్న ఫొటో ఫ్రేమ్‌ను కూడా రాఘవ ఆ మహిళకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో ఆమె కళ్లవెంట కన్నీరు పెట్టుకుంది. అంతే కాకుండా ఆమె ఎంతో సంతోషంగా ఫీల్ అయింది. ఆ వీడియో చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రావాల్సిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
- Tags
- Raghava Lawrence