- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
చిరంజీవి - సురేఖ దాంపత్య జీవితంపై సీనియర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. అంత దారుణంగా పరిశీలిస్తుందా..?
దిశ, సినిమా : సీనియర్ హీరోయిన్ రాధ అప్పటి కుర్రాళ్ల హాట్ ఫేవరెట్. యూత్ గుండెల్లో గూడు కట్టుకున్న దేవత. మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులకు ఎవరైనా మ్యాచ్ చేశారా అంటే ఆమె పేరే ముందు వినిపిస్తుంది. డ్యాన్స్ అంటే పిచ్చి ఉన్న ఆమె చిరుతో లెగ్ షేక్ చేసేందుకు ఎప్పుడూ ఎగ్జయిటింగ్ గా వెయిట్ చేసేది. ఇక మెగాస్టార్ తన కోస్టార్స్ ను చాలా ఆప్యాయంగా, ప్రేమగా చూసుకుంటాడని తెలిసిన విషయమే. కాగా తన అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన రాధ.. చిరు దంపతుల మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ చూసి ముచ్చటేసిందని చెప్పింది.
మెగాస్టార్ ఇంటికి వెళ్తే సురేఖ చాలా బాగా స్వాగతం చెప్తుందని.. దగ్గరుండి అన్నీ చూసుకుంటుందని తెలిపింది. అయితే వారిద్దరిలో తనకు నచ్చిన విషయం ఒకరికి మరొకరు గౌరవం ఇవ్వడం.. తాను స్టార్ హీరోనని మరిచిపోయి ఒక భర్తగా ఆమె దగ్గర చాలా నార్మల్ గా బిహేవ్ చేయడమని చెప్పింది. అందుకే ఇప్పటికీ వాళ్ల దాంపత్య జీవితం మధురంగా, సంతోషంగా ఉందని అభిప్రాయపడింది. కాగా దీనిపై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. ఏంటి చిరు - సురేఖను ఈమె అంత దారుణంగా పరిశీలించిందా అంటున్నారు.