- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పుష్ప-2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హైలెట్‌గా నిలిచిన చిటికెన వేలు గోరు (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘పుష్ప-2’. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ.. 2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ‘పుష్ప2’ ఆ అంచనాలను అందుకునేలా తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. అయితే వచ్చే సంవత్సరం ఆగస్టు 15న ‘పుష్ప2’ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ చేతిని చూపిస్తూ, అందులో చిటికెన వేలు గోరును హైలైట్ చేసింది మూవీ టీమ్. కొన్ని రోజుల కిందట ‘వేర్ ఈజ్ పుష్ప’ పేరుతో విడుదల చేసిన వీడియోలోనూ అదే గోరును హైలైట్ చేశారు. అయితే అప్పట్లో దాని గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఇలా కేవలం చిటికెన వేలు గోరును ప్రత్యేకంగా చూపించడం వెనుక ఓ థియరీ ఉందని చెబుతున్నారు.
అదేంటంటే, కొన్ని సంస్కృతుల్లో తమ సంపదను, సమాజంలో స్థాయిని చూపించేందుకు చిటికెన వేలు గోరు పెంచుకుంటారట. అంతేకాదు, కేవలం రూల్ చేయడానికి మాత్రమే తాము ఉన్నట్లు గుర్తుగా చూపించడానికి కూడా పెంచుతారని అంటున్నారు. ఇక ఎర్ర చందనం బిజినెస్‌ని చిటికెన వేలుపై నిలబెట్టి చేయగలడని సూచనగా దాన్ని హైలైట్ చేస్తున్నట్టు టాక్. సుకుమార్ తీసే ప్రతి షాట్ విషయంలోనూ కొన్ని రిఫరెన్స్‌లు ఉంటాయి. అవేంటో స్వయంగా ఆయనే చెబితేనే తెలుస్తుంది. గతంలో ‘రంగస్థలం’లో జగపతిబాబు పాత్రకు పామును రిఫరెన్స్‌గా తీసుకున్నారు. పామును ఏ విధంగానైతే కొట్టి చంపుతారో అలాగే ఫణీంద్రభూపతిని అంటే జగపతిబాబుని కూడా రామ్‌చరణ్ అలానే కొట్టి చంపుతాడు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గోరును హైలైట్ చేయడం వెనుక ఏముందో చూడాలి.