- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Double ISmart: డబుల్ ఇస్మార్ట్ రివ్యూ.. పూరీ, రామ్ హిట్ కొట్టినట్టేనా?
నటీనటులు: రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, సాయాజీ షిండే, గెటప్ శ్రీను తదితరులు
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛారీ
రచన, దర్శకత్వం: పూరీ జగన్నాథ్
దిశ, సినిమా: ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించాడు. ఇక రిలీజ్‌కు ముందు సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేశారు చిత్ర బృందం. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ రోజు (గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను రీజ్ అయ్యిందో లేదో తెలుసుకోవాల్సిందే!
కథ: బిగ్ బుల్ (సంజయ్ దత్) విదేశాల్లో చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతూ.. భారతదేశాన్ని ముక్కులు చేయాలని కలలు కంటాడు. కానీ, ఇంతలో అతడిని బ్రెయిన్ ట్యూమర్ ఉండటంతో రెండు, మూడు నెలల్లో చనిపోతానని తెలుసుకుంటాడు. దీంతో తన మెమొరీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలోనే ఇస్మార్ట్ శంకర్ (రామ్)కి ఆల్రెడీ మెమోరీ ట్రాన్స్‌ఫర్మేషన్ సక్సెస్ అయిందని తెలుసుకున్న బిగ్ బుల్.. అతడి మెమొరీని ఇస్మార్ట్ శంకర్ బ్రెయిన్‌లోకి పంపాలి అనుకుంటాడు. అనంతరం శంకర్ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టేందుకు తన మనుషులను రంగంలోకి దింపుతాడు బిగ్ బుల్. మరి బిగ్ బుల్ అనుకున్నట్లుగా మెమొరీ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిందా.. ఒకవేళ జరిగితే కథలో ఎలాంటి ట్విస్ట్‌లు వస్తాయి అనేది స్టోరీ.
ఎలా ఉందంటే: పార్ట్ 1లో జరిగిన చిప్ స్టోరీనే రొటీన్‌గా పార్ట్ 2లో కూడా కంటిన్యూ చేశాడు డైరెక్టర్ పూరీ. తర్వాత బిగ్ బుల్ మెమొరీ ఇస్మార్ట్ శంకర్ అమర్చి సెకండ్ ఆఫ్ కంటిన్యూ చేశారు. మొత్తానికి ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ని కొంచెం మెప్పించింది కానీ.. ఓవరల్‌గా మాత్రం చాలా విమర్శలు ఎదుర్కొంది.