కాలేజీ రోజుల్లోనే పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టింది.. యంగ్ నటి

by GSrikanth |
కాలేజీ రోజుల్లోనే పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టింది.. యంగ్ నటి
X

దిశ, సినిమా : కోలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్‌ తన పెళ్లిపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సినిమాల్లోకి అడుగుపెట్టకపోయి ఉంటే ఎపుడో పెళ్లి చేసుకుని స్థిరపడి ఉండేదాన్నని చెప్పింది. ఆమె నటించిన 'యానై' ఈ నెల 17న విడుదల కాబోతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. 'అందరిలాగే నాకు పెద్ద హీరోలతో పని చేయాలనే ఆశ ఉంది. సినిమా రంగంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలనే కోరికతోనే కెరీర్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నా. నిజానికి కాలేజీ విద్య పూర్తికాగానే పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోవాలని భావించాను. కానీ అనుకోని విధంగా సినిమా రంగంలోకి అడుగుపెట్టడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నా' అంటూ వివరించింది. ఇక ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. ప్రస్తుతం 'పత్తు తల', 'తిరుచిట్రాంబలం' 'రుద్రన్‌', 'బొమ్మై' వంటి వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది.

Advertisement

Next Story

Most Viewed