శివకార్తికేయన్ 'ప్రిన్స్'.. డ్యాన్స్ అదరగొట్టిన తెల్ల పిల్ల

by sudharani |   ( Updated:2023-10-12 07:23:13.0  )
శివకార్తికేయన్ ప్రిన్స్.. డ్యాన్స్ అదరగొట్టిన తెల్ల పిల్ల
X

దిశ, సినిమా: త‌మిళ హీరో శివ కార్తికేయ‌న్ తెలుగులో కూడా మంచి ఫేమ్‌ సొంతం చేసుకున్నాడు. రెమో సినిమాలో లేడీ గెటప్‌తో తెలుగు ప్రేక్షకులకు ప‌రిచ‌య‌మైన శివ కార్తికేయ‌న్‌ 'డాక్టర్', 'డాన్' వంటి వ‌రుస హిట్లతో టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్‌ ఏర్పరుచుకున్నాడు. ఇక తన తదుపరి చిత్రం 'ప్రిన్స్' కాగా.. ఈ చిత్రానికి 'జాతిర‌త్నాలు' ఫేం అనుదీప్ కేవి ద‌ర్శక‌త్వం వహించారు.

అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ ఆగస్టు 31న విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల రెండు నెలలు పోస్ట్ పోన్ అయింది. దీంతో ఈ సమయాన్ని ఉపయోగించుకుంటూ వ‌రుస అప్‌డేట్‌ల‌తో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూన్నారు మేకర్స్. ఇదే క్రమంలో తాజాగా సినిమాలోని 'బింబిలిక్కి పిలాపి' అనే సాంగ్‌‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పాటలో హీరో కార్తికేయన్ సిగ్నేచర్ స్టెప్స్.. హీరోయిన్ మూవ్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

Next Story