‘టిల్లు స్క్వేర్’ కు ఏమైంది.. ప్రీమియర్ షోలు క్యాన్సిల్..?

by Disha Web Desk 7 |
‘టిల్లు స్క్వేర్’ కు ఏమైంది.. ప్రీమియర్ షోలు క్యాన్సిల్..?
X

దిశ, సినిమా: ఈ రోజుల్లో ప్రీమియర్ షోలు అనేవి చాలా వాటెండ్ అయిపోయాయి. పోస్టర్లు, అప్‌డేట్లు, ప్రమోషన్స్‌తో మూవీపై కొంచెం హైప్ పెరిగిన ప్రీమియర్ షోలు వేస్తారు. ప్రీమియర్ షోల బిజినెస్ కూడా చాలా భారీగా జరుగుతుంది. అలాగే ‘టిల్లు స్క్వేర్’ మూవీ ప్రీమియర్లకు కూడా టైం ఫిక్స్ చేశారు. కానీ తాజా సమాచారం మేరకు ఈ ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అవుతున్నాయని తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, ట్రైలర్ ఎంతో ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఓ స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేయ్యడంతో.. మూవీపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రేపు (మార్చి 29) రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ మూవీపై నెట్టింట ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

అయితే.. ‘టిల్లు స్క్వేర్’ సినిమాకు సంబంధించిన మీడియా షో లను ఇప్పటికే క్యాన్సిల్ చేశారట నిర్మాత నాగ వంశి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో షాకింగ్ నిర్ణయం కూడా తీసుకున్నారని యూఎస్ సినీ మార్కెట్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. ‘టిల్లు స్క్వేర్’ సినిమాకి ముందస్తుగా ఎలాంటి ప్రీమియర్ షోలు అమెరికాలో కూడా వేయడం లేదట. అంతేకాకుండా ప్రీమియర్ షోల కోసం అమ్మిన టికెట్లు సైతం క్యాన్సిల్ చేశారని టాక్. ఆ క్యాన్సిల్ చేసిన టికెట్ల డబ్బులు రిఫండ్ కూడా చేస్తున్నారట. అయితే.. అమెరికాలో తెలుగు సినమా హిస్టరీలో ఇంతకుముందు లేని విధంగా ప్రీమియర్ టికెట్లు మూడు వారాల ముందే అమ్మేసి ఇప్పుడు క్యాన్సిల్ చేయడంతో షాక్ అవుతున్నారు.

తెలుగు సినిమా రిలీజ్‌కు ముందే అమెరికాలో ప్రీమియర్ షోలు పడతాయన్న విషయం తెలసిందే. ఈక్రమంలోనే అక్కడ ఎలాగో మాస్ మసాలా సినిమాలు వస్తాయి కాబట్టి.. ‘టిల్లు స్క్వేర్’ మూవీ వాళ్లను అంతగా ఆకట్టుకోకపోతే నెగిటివ్ రివ్వ్యూలు ఇస్తారు. ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడకుండా ఉండటానికే ప్రీమియర్ షోలు నిలిపివేసినట్లు సమాచారం. అయితే.. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.


Next Story