- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas: తన ఫస్ట్ క్రష్ ఎవరో బయటపెట్టిన ప్రభాస్.. ఆమె ఎవరంటే?
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుస సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవల డార్లింగ్ నటించిన కల్కి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటుగా రూ. 1000 కోట్ల కలెక్షన్స్ పైగానే రాబట్టింది. ఇప్పటికీ థియేటర్స్‌లో దుమ్మురేపుతోంది. ఇక ప్రభాస్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. 44 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. గత కొద్ది కాలంగా ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడంటూ పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే హీరోయిన్లతో ఎఫైర్స్ ఉన్నట్లు రూమర్స్ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఈ ఏడాది వివాహం చేస్తామని చెప్పింది. కానీ ఆయన మాత్రం రాజాసాబ్ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ తన ఫస్ట్ క్రష్ ఎవరో రివీల్ చేసి వార్తల్లో నిలిచాడు. మీ ఫస్ట్ క్రష్ స్కూల్లోనా లేక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? అంటూ యాంకర్ అడగ్గా.. స్కూల్లోనే నా ఫస్ట్ క్రష్ అని చెప్పాడు. కానీ ఆమె పేరు అడగ్గానే తెలీదు.. గుర్తులేదు మర్చిపోయా అని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు.
ఆ తర్వాత యాంకర్ ఏ క్లాస్‌లో ఉన్నప్పుడు లవ్ చేశారు? అని అడగడంతో.. తను నా క్లాస్ మెట్ కాదు టీచర్‌యే నా ఫస్ట్ క్రష్. నేను చదివింది చెన్నైలో.. స్కూల్లో ఓ టీచర్ చాలా బాగుండేది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన వారంతా.. డార్లింగ్ ఇలాంటి చిలిపి చేష్టలు కూడా చేశాడా? అని అంటున్నారు.
- Tags
- Prabhas