ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే.. ‘కల్కి 2898’ రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. వచ్చేది అప్పుడే (పోస్ట్)

by Disha Web Desk 7 |
ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే.. ‘కల్కి 2898’ రిలీజ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. వచ్చేది అప్పుడే (పోస్ట్)
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘కల్కి 2898’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో.. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి వంటి స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా గురించి ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. తాజాగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు ‘𝟐𝟕-𝟎𝟔-𝟐𝟎𝟐𝟒 రోజున అన్ని శక్తులు కలిసి రానున్నాయి’ అంటూ పోస్ట్ పెట్టింది. అయితే గతంలో ఈ చిత్రం మే 9న రిలీజ్ అని ప్రకటించినప్పటికీ అది పోస్ట్ పోన్ అయింది. ఇక ఇప్పుడు అసలు రిలీజ్ డేట్ రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండుగా చేసుకుంటున్నారు.

Read More..

బాల్యంలోనే లైంగిక వేధింపులకు గురయ్యాను.. స్టార్ కిడ్ షాకింగ్ కామెంట్స్



Next Story

Most Viewed