Prabhas ‘Salaar’ విషయంలో మరింత కేర్ పెంచేసిన దర్శకుడు..!

by Prasanna |   ( Updated:2023-08-20 17:10:38.0  )
Prabhas ‘Salaar’ విషయంలో మరింత కేర్ పెంచేసిన దర్శకుడు..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో ‘సలార్’ ఒక్కటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రజంట్ అయితే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కోసం అయితే ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. ఇక ఈ సాలిడ్ ట్రైలర్ కట్ పనుల్లోనే మేకర్స్ ఇప్పుడు బిజీగా ఉండగా లేటెస్ట్‌గా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకొచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తమ దగ్గర ఉన్న అవుట్ పుట్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు చాలా కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఎలాంటి లీక్స్ జరగకుండా.. నీల్ ఈ సినిమా పనులను మరో సేఫ్ ప్లేస్‌లోకి మార్చినట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచే ట్రైలర్ సహా ఇతర పనులు చేస్తారట. మరి ఇలాంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం ఆ మాత్రం కేర్ తీసుకోవడంలో తప్పులేదు అంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :ఇక విరామం తీసుకునే ప్రసక్తే లేదంటున్న మహేష్ బాబు

Advertisement

Next Story