- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Prabhas: ప్రభాస్-హోంబలే కోసం రంగంలోకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్!

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘రాజాసాబ్’. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల కానుంది. వీటితో పాటు డార్లింగ్, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి2898 ఏడీ’(Kalki 2898 AD) పార్ట్ -2, హను రాఘవ పూడితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. మూడు భారీ చిత్రాలను నిర్మించిన సంస్థ హోంబలే ఫిల్మ్స్(Hombale Films) పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)తో మూడు చిత్రాలు చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాటిక్ అనుభూతిని అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అయితే ఇందులో ఒకటి ‘సలార్-2’(Salar-2). దీనికి ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఇంకా రెండు మూవీస్ ఎవరూ తెరకెక్కిస్తున్నారనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ న్యూస్ వైరల్ అవుతోంది. హోంబలే, ప్రభాస్ కోసం ఓ స్టార్ డైరెక్టర్ రంగంలోకి దిగినట్లు టాక్. కోలీవుడ్ స్టార్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj ), డార్లింగ్ కాంబోలో ఓ పాన్ ఇండియా మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట వైరల్ కావడంతో సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.