నన్ను నా కూతురిని.. Prabhas Fans బెదిరిస్తున్నారు.. Director Vivek Agnihotri..!

by Hamsa |   ( Updated:2023-09-27 15:49:21.0  )
నన్ను నా కూతురిని.. Prabhas Fans బెదిరిస్తున్నారు.. Director Vivek Agnihotri..!
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన ఎప్పుడూ పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఇటీవల వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ ని ఉద్దేశిస్తూ పలుమార్లు అనుచిత కామెంట్స్ చేశారు. ది వాక్సిన్ వార్ మూవీతో సలార్ ని ప్లాప్ చేస్తానని, ఆదిపురుష్ మూవీపై కూడా వివేక్ అగ్నిహోత్రి అనుచిత కామెంట్స్ చేశారు. ఎవరిని పడితే వాళ్ళని రాముడు అంటే జనాలు అంగీకరించరు. కనీస పరిజ్ఞానం లేకుండా ఆదిపురుష్ తెరకెక్కించారని వివేక్ అగ్నిహోత్రి అన్నారు.

తాజాగా, మరోసారి వివేక్ అగ్నిహోత్రి ప్రభాస్ ఫ్యాన్స్ వేధిస్తున్నారని ఆరోపణలు చేసినట్లు సమాచారం. తనతో పాటు తన కూతురిని కూడా అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో వేధిస్తున్నారని తెలిపాడు. దీంతో ఈ విషయం తెలిసిన కొందరు ఆయనపై ఫైర్ అవుతూ ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారని చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Prabhas చేత Krishnam Raju అలాంటి ఒట్టు వేయించుకున్నారా!

రవితేజ పాట వింటూ బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తున్న బాలయ్య.. ఎక్కడో తెలుసా? (వీడియో)

Next Story

Most Viewed