Kalki 2898 AD : దుల్కర్, విజయ్ సినిమాలో ఉన్నారని కన్ఫర్మ్ చేసిన ప్రభాస్.. పాత్రలు ఇవే..

by Sujitha Rachapalli |
Kalki 2898 AD : దుల్కర్, విజయ్ సినిమాలో ఉన్నారని కన్ఫర్మ్ చేసిన ప్రభాస్.. పాత్రలు ఇవే..
X

దిశ, సినిమా: ప్రభాస్ కల్కి మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలో నంబర్ ఆఫ్ స్టార్స్ ఉండబోతున్నారని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పగా.. ఎవరై ఉంటారా అనే చర్చ జరిగింది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని లాంటి హీరోల పేర్లు వినిపించాయి. కానీ ఇక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. క్లారిటీ రాలేదు. అయితే ముంబైలో మీడియాతో మాట్లాడిన ప్రభాస్.. అనుకోకుండా టంగ్ స్లిప్ అయ్యాడు. విజయ దుల్కర్ ఇందులో భాగం కావడం వల్ల సినిమా మరింత పెద్దగా మారిందని థాంక్స్ చెప్పాడు. ఆ వెంటనే రియలైజ్ అయిపోయి డైరెక్టర్ కు సారీ చెప్పాడు. దీంతో దర్శకుడు కూడా కన్ఫర్మ్ చేయాల్సి వచ్చింది. కాగా విజయ్ అర్జునుడిగా, దుల్కర్ ప్రభాస్ తండ్రిగా కనిపిస్తాడని టాక్.

కాగా కల్కి ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, రాజేంద్ర ప్రసాద్, శోభనతో పాటు మరింత మంది నటీనటులు ఈ సినిమా కోసం పనిచేశారు. మరికొద్ది సేపట్లో థియేటర్స్ లో కనిపించబోతున్నారు. మొత్తానికి సినిమా మాత్రం బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తుందని నమ్ముతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

Advertisement

Next Story

Most Viewed