- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. OG రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ ఫైనల్..!
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుజీత్ డైరెక్షన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొంతమేర పూర్తి అయి పోస్టర్స్, గ్లింప్స్ విడుదలయ్యాయి. ఇందులోంచి రిలీజ్ అయిన అప్డేట్స్ మూవీపై భారీ అంచనాలను పెంచాయి. ఇక విడుదల రెడీగా ఉందనుకునే క్రమంలో.. పవన్ కల్యాణ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్‌లో ఆయన పోటీ చేసి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో పేదలకు సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు.
ఇక సినిమాలకు పూర్తిగా దూరం అవుతాడని వార్తలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ క్రమంలో.. పవన్ కొన్ని రోజుల తర్వాత షూటింగ్స్‌లో పాల్గొంటానని ఈ విషయం నిర్మాతలకు కూడా చెప్పానని తెలపడంతో కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఫ్యాన్స్ ముఖ్యంగా పవన్, సుజిత్ కాంబోలో వచ్చే ఓజీ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఇక ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ వేడి అంటే ఏంటో ఓజీ రిలీజ్ తర్వాత చూపిస్తామని కామెంట్లు పెడుతున్నారు.
(Video Link Credits to cinecorntelugu Instagram Channel)
- Tags
- Pawan Kalyan
- OG