మహేష్-త్రివిక్రమ్ మూవీ‌పై పూజా హెగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Anjali |
మహేష్-త్రివిక్రమ్ మూవీ‌పై పూజా హెగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా‌ హెగ్డే భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. తాజాగా బాలీవుడ్‌ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంలోనూ నటించింది. రంజాన్ కానుకగా ఈ మూవీ ఏప్రిల్ 21న విడుదల కానుంది. దీంతో వరుసగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న పూజ, ఈ సందర్భంగా మహేష్‌తో సినిమా గురించి కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది.

మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.. కాగా ఈ మూవీ గురించి పూజ మాట్లాడుతూ ‘‘ఇందులో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. కొంచెం కొత్తగా కనిపిస్తాను. ఇక మహేష్ బాబు గురించి చెప్పాలంటే.. ఇంతకు ముందెన్నడూ చూడని రూపంలో అతను కనిపిస్తాడు. మాట తీరు కూడా డిఫరెంట్‌గా ఉంటుంది’’ అంటూ చెప్పుకొచ్చింది పూజ.

Advertisement

Next Story